Rakul: పూరీకి డేట్స్ ఇవ్వని హీరోయిన్
వెంకటాద్రి ఎక్స్ప్రెస్(Venkatadri Express)తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రకుల్(Rakul) ఆ మూవీతోనే ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే రకుల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కన్నడ మూవీ గిల్లీ(Gilly)తో. ఆ తర్వాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేసింది. తక్కువ టైమ్ లోనే అందరి హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని బాలీవుడ్ లో సెటిలైపోయింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన కెరీర్ మొదట్లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మోడలింగ్ లో ఉన్నప్పుడు తనకు సౌత్ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదని, అందుకే తనకు ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఆసక్తి చూపించలేదని చెప్పింది. చివరకి తన తండ్రికి ఫోన్ చేసి అడగటంతో గిల్లీ సినిమాలో నటించినట్టు రకుల్ చెప్పుకొచ్చింది.
మొదటి సినిమాతోనే నటనపై ఆసక్తి పెరిగిందని, చదువుకుంటూనే యాక్టింగ్ కూడా చేయాలని డిసైడయ్యానని తెలిపింది. ఈ నేపథ్యంలోనే గిల్లీ రిలీజయ్యాక పూరీ(Puri Jagannadh) నుంచి ఫోన్ వచ్చిందని, ఓ మూవీ కోసం పూరీ 70 రోజులు డేట్స్ అడిగితే అందుకు తాను కుదరదు కాలేజ్ ఉందని, కావాలంటే నాలుగు రోజులు ఇస్తానన్నట్టు చెప్పిందట. పూరీ మూవీని మాత్రమే కాకుండా ఆ టైమ్ లో తాను ఎన్నో సినిమాలను వదులుకున్నట్టు రకుల్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.













