నా పెళ్లి జరిగిపోయింది : రాఖీ
బ్రిటన్ కు చెందిన ఒక వీరాభిమానితో తన పెళ్లి అయిందని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తెలియజేశారు. లండన్ వ్యాపారవేత్త అయిన రితేష్ తనకు చాలా కాలంగా ఫ్యాన్‌గా ఉన్నాడని, ఆయనంటే తనకు ప్రేమ అని, తనను నిజంగా ప్రేమించే ఆయనను పెళ్లి చేసుకున్నాని రాఖీ సావంత్ చెప్పారు. సావంత్ పెళ్లి అయినట్టు చాలా కాలంగా బాలీవుడ్లో ప్రచారం జరిగింది. ఇంత కాలం పెళ్లి విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచినట్లు అనే సందేహం అందరికీ వస్తుందని, చిత్ర పరిశ్రమ చిత్రమైనదని, పెళ్లి చేసుకుంటే నటికి అవకాశాలు తగ్గుతాయని, అందుకే తాను సీక్రెట్‌గా ఉంచానని తెలిపారు. కొందరు హీరోయిన్లకు పెళ్లి అయినా చాన్స్‌ల క్రేజ్ తగ్గదని, తన లాంటి ఐటెమ్ సాంగ్స్, నటికి ఇకపై సినిమా ఛాన్స్‌లు వస్తాయో రావో తెలియదని, ఇదో బాధనే అని, అయితే తన కలలకు తగ్గ వ్యక్తిని కట్టుకున్నందుకు పడుతున్న సంతోషం అంతకు మించినదని తేల్చిచెప్పారు.
ఏడాదిగా రితేష్‌తో కలిసి తిరుగుతున్న రాఖీ సావంత్ గత నెల 28వ తేదీన ముంబైలోని అంధేరీలో ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో పెళ్లి చేసుకుంది. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల మేళవింపుతో జరిగిన ఈ పెళ్లి తనకు ఆనందాన్ని కల్గించిందని రాఖీ చెప్పారు.













