పెళ్లికి సిద్ధమైన రాఖీసాంత్
సోషల్ మీడియాలో హల్చల్ చేసే హాట్‌బ్యూటీ రాఖీసావంత్ పెళ్లికి సిద్ధమవుతోంది. సంచలనాలు, హంగామాలకు కేరాప్ అడ్రస్ అయిన ఈ భామ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. తరుచుగా పలు వివాదాలతో వార్తల్లో నిలిచే ఈ భామ దీపిక్ కలాల్ అనే వ్యక్తిని వివాహమాడనుంది. డిసెంబర్ 31న సాయంత్రం 5:55 గంటలకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సిటీలో వీరి వివాహం జరుగుతుందట. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో రాఖీ, దీపక్‌లు తమ వెడ్డింగ్ కార్డును పోస్ట్ చేశారు. మరి ఇది నిజంగా వెడ్డింగ్ కార్డేనా లేదా మరో పబ్లిసిటీ స్టంటా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ చేయడానికి ముందు రాఖీ సావంత్‌కు సంబంధించిన వల్గర్‌గా కొన్ని కామెంట్స్ కూడా చేశాడు దీపక్. దీనికి స్పందిస్తూ నెటిజన్లు కూడా అదేవిధంగా కామెంట్స్ చేస్తున్నారు.













