రాజుగారి గది-3 ట్రైలర్ను విడుదల చేసిన వెంకటేశ్
అశ్విన్ బాబు, అవికా గోర్ నటీనటులుగా ఓంకార్ స్వీయ దర్శకత్వంలో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం రాజుగారి గది-3. ఈ సినిమా ట్రైలర్ను హీరో వెంకటేశ్ విడుదల చేశారు. అనంతరం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో ఓంకార్ మాట్లాడుతూ రాజుగారి గది-2 లో కామెడీ తగ్గిందని చాలామంది చెప్పారు. అందుకే ఈ సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించా. నవ్విస్తూ భయపెడుతుంది. డబ్బింగ్ చెప్పాక అలీగారు పెద్ద హిట్ అవుతుందని ప్రశంసించారు. అక్కడే సగం సక్సెస్ అయిన భావన కలిగింది అని అన్నారు.













