Khaidhi2: కార్తీకి జోడీగా మలయాళ నటి
తమిళంతో పాటూ తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న కార్తీ(Karthi) రీసెంట్ గా సత్యం సుందరం(Satyam Sundaram) సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కార్తీ సినిమాల్లో ఖైదీ(Khaidi) సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పటికీ చాలా బాగా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే ఖైదీకి సీక్వెల్ గా ఖైదీ2(Khaidi2) ఉంటుందని కార్తీ, లోకేష్ గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU) లో భాగంగా రూపొందనున్న ఖైదీ2 ఈ ఏడాది సమ్మర్ నుంచి మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఖైదీ2 ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ రజిష విజయన్(Rajisha vijayan) నటిస్తుందని సమాచారం.
ఫ్లాష్ బ్యాక్ లో కార్తీ సరసన రజిష జోడీగా కనిపిస్తుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతన్నది చూడాలి. ప్రస్తుతం మిత్రన్(Mithran) దర్శకత్వంలో సర్దార్2(Sardar2) చేస్తున్న కార్తీ ఆ సినిమాను పూర్తి చేసి ఖైదీ2 ను మొదలుపెట్టే ఛాన్సుంది. మరోవైపు లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) తో కూలీ(Coolie) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.













