కంగువ- వెట్టయాన్ మధ్య నెక్ట్స్ లెవెల్ వార్
అక్టోబర్ 10న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అవడంతో పదో తేదీ మీద కోలీవుడ్ భారీ స్కెచ్ వేసింది. సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొన్ని వారాల కిందటే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు పోటీకి ఎవరూ రారని, ఒకవేళ వచ్చినా పార్ట్1 చూసి పార్ట్2 టైమ్ కు అందరూ తప్పుకుంటారని నిర్మాత చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.
అయితే పార్ట్2 వరకు ఎందుకని కంగువ పార్ట్ 1కు పోటీగా రజినీకాంత్ వెట్టయాన్ ను అక్టోబర్ 10నే రిలీజ్ చేస్తుంది లైకా ప్రొడక్షన్స్. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఒక్కసరిగా తమిళనాడు రెండు పెద్ద గ్రాండియర్లు ఒకే రోజున థియేటర్లను సర్దుబాటు చేయాలా అని డిస్ట్రిబ్యూటర్లందరికీ గుండె ఝల్లుమంది.
కనీసం ఒక రోజైనా గ్యాప్ ఉంటే దాన్ని బట్టి థియేటర్లను అడ్జస్ట్ చేసేవాళ్లు కానీ వెట్టయాన్ టీమ్ రిలీజ్ డేట్ విషయంలో అసలు వెనక్కి తగ్గేదేలే అని కంగువని ఢీ కొట్టడానికి రెడీ అయింది. కంగువ, వెట్టయాన్ రెండు సినిమాల తెలుగు రాష్ట్రాల హక్కులు క్రేజీ నిర్మాతల చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. వెట్టయాన్ కు రూ.14 కోట్ల డీల్ జరిగిందని టాక్. కంగువకు ఈ నెంబర్ చాలా పెద్దగా ఉండటం ఖాయం. మొత్తానికి అక్టోబర్ 10న జరిగే ఈ పోటీ చాలా రసవత్తరంగా సాగనుందనేది మాత్రం అర్థమవుతుంది.













