త్వరలో అమెరికాకు సూపర్‍స్టార్ రజనీ!

తమిళ సూపర్‍స్టార్ రజనీకాంత్ త్వరలో అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. అమెరికాలో రజనీ 20 రోజుల పాటు బస చేసి వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని చైన్నెకు తిరిగిరానున్నట్లు కోలీవడ్ వర్గాలు తెలిపారు. ప్రస్తుతం రజనీ హైదరాబాద్‍లో జరుగుతున్న అన్నాత్త షూటింగ్ చివరి షెడ్యూల్‍లో పాల్గొంటున్నారు. అన్నాత్త చిత్రం షూటింగ్ పూర్తి కాగానే ఆయన అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. అమెరికా నుండి రాగానే రజనీ తన కొత్త చిత్రం గురించి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.