మళ్లీ పెళ్లి పీటలెక్కుతున్న సౌందర్య
తమిళ సూపర్ స్టార్ రంజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య మళ్లీ పెళ్లి పీటలెక్కబోతోంది. 2010లో వ్యాపారవేత్త అశ్విన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన సౌందర్య 2017లో అతని నుంచి విడిపోయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. అయిదేళ్ల ఈ అబ్బాయి సౌందర్యతోనే రజనీకాంత్ ఇంట్లో ఉంటున్నాడు. సౌందర్య రెండో పెళ్లి చేసుకోనున్న వ్యక్తి పేరు విశాగన్. ఫార్మాస్యూటికల్ బిజినెస్ కలిగిన విశాగన్ సినిమాల్లోనూ నటిస్తుంటాడు. అయితే ఇంకా అతనికి నటుడిగా గుర్తింపు రాలేదు. అతనికి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ఒక జర్నలిస్ట్‌ను పెళ్లాడిన విశాగన్ అమెతో సరిపడక విడాకులు తీసుకున్నాడు. కాగా సౌందర్య విశాగన్‌ల పెళ్లికి రజనీకాంత్ దంపతులు అమోద ముద్ర వేశారని, వీరివురుకి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిందని పెళ్లి జనవరిలో జరగనుందని సమాచారం. సౌందర్య, విశాకన్లు ఇద్దరికీ రెండో పెళ్లే కావడంతో నిశ్చితార్థం మీడియాకి దూరంగా జరిపినట్లు సమాచారం.













