పేట్టలో హైలైట్ పాట ‘మారన మాస్’
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం పేట్ట. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక. విజయ్ సేతుపతి, శశికాంత్, సిమ్రాన్, మేఘా ఆకాష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అలపించగా అనిరుధ్ సంగీతం అందించిన మారన్ మాస్ అనే గీతాన్ని విడుదల చేయనున్నారు. సిమాలోని ఈ పాట హైలైట్‌గా నిలవనుందట. ఈ సందర్భంగా రజనీ కొత్త లుక్‌ను సంబంధించిన స్టిల్‌ను చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత కళా నిధి మారన్ సన్నాహాలు చేస్తున్నారు.













