మరో సినిమాను లైన్లో పెట్టిన రజినీ
సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajini Kanth) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన వేట్టయాన్(Vettayan) అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేట్టయాన్ రిలీజ్ కు రెడీగా ఉండగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో కూలీ(Coolie) సినిమా కూడా రజినీ చేస్తున్నాడు. కూలీ సినిమాపై అందరికీ నెక్ట్స్ లెవెల్ లో అంచనాలున్నాయి.
కూలీ సినిమా పూర్తవకముందే రజినీకాంత్ మరో సినిమాను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో వచ్చిన 2018 మూవీ(2018 Movie) డైరెక్టర్ జూడ్ ఆంతోనీ జోసెఫ్ (Jude Anthany Joseph)డైరెక్షన్ లో రజినీ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని త్వరలోనే సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండనుందని తెలుస్తోంది.
వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Vels Film International Ltd.) బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కథ ముందు శింబు(Simbhu) దగ్గరకు వెళ్లింది. కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడదే కథను రజినీకి వినిపించి ఆయనతో ఓకే చేయించుకున్నాడు జోసెఫ్. కూలీ సినిమాను నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేసే ఛాన్సుండగా, ఈ కొత్త సినిమాను 2025 సెకండాఫ్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













