రజనీకాంత్ మరో అరుదైన రికార్డు
ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు అందరి దృష్టి ఆ సినిమా సాధించబోయే కలెక్షన్స్ రికార్డుల మీదే ఉంటుంది. ఎన్ని స్క్రీన్స్‌లో సినిమా రిలీజ్ అవుతోంది, అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంత, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఇలా చర్చ సాగుతుంది. రజనీకాంత్ తాజా చిత్రం 2.0 పై కూడా ఈ చర్చ జరుగుతోంది. వీటికి తోడుగా మరో అరుదై రికార్డు రజనీకాంత్ ఖాతాలో వచ్చి పడింది. బ్లాక్ అండ్ వైట్ మూవీస్, కలర్ సినిమాలు, యానిమేటెడ్ చిత్రం, 3డి ఫిల్మ్ ఇలా నాలుగు ఫార్మాట్లలో నటించిన ఒకే ఒక హీరో రజనీకాంత్ మాత్రమే. రజనీ కెరీర్ మొదలైంది బ్లాక్ అండ్ వైట్ సినిమాలతోనే. ఆ తర్వాత మెల్లిగా కలర్ మూవీస్‌కు సినిమా ఇండస్ట్రీ వచ్చింది. పలు సూపర్ హిట్ కలర్ మూవీస్ చిత్రాలతో రజనీకాంత్ సౌతిండియా స్టార్ హీరోగా ఎదిగారు. ఇక కొచ్చాడయాన్ సినిమాతో యానిమేటెడ్ ఫిలింలో కూడా నటించారు. తాజాగా 2.0తో 3డి సినిమాలో కూడా నటించారు. ఇది నిజంగానే ఒక అరుదైన ఘనత. ప్రపంచ వ్యాప్తంగా ఇతర నటులు ఎవరైనా ఈ ఘనతను సాధించారో లేదో తెలియదు కానీ ఇండియా వరకు మాత్రం ఈ రికార్డు రజనీకాంత్‌కు మాత్రమే సొంతం. దీంతో రజనీ అభిమానులు ఈ రికార్డును చూసి మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో మా తలైవా గొప్ప ఇది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.













