సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లిస్తున్నందుకు గాను ఆ శాఖ అధికారులు ప్రతిష్ఠాత్మక అవార్డును రజనీకాంత్‌కు ప్రధానం చేశారు. ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి గరవ్నర్ తమిళి సై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి రజనీకాంత్ హాజరు కాలేదు. ఆయన స్థానంలో పెద్ద కూతురు ఐశ్వర్య ఈ అవార్డును స్వీకరించారు.













