అభిమానులకు సృష్టమైన సందేశం ఇచ్చిన తలైవా
రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిరాశ పరిచినా, అసెంబ్లీ ఎన్నికల నాటికి సిద్ధమని చెప్పి తలైవా సృష్టమైన ప్రకటన చేశారు. 2021 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, అప్పటి వరకు సినిమాలతో జీవితం అని సృష్టం చేశారు. తమిళనాడు శాసనసభకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నానని తాజాగా మీడియా ప్రతినిధుల ముందు క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల బరిలో రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటం చేస్తారని ఆయన అభిమానులు ఆశించారు. కానీ భిన్నమైన నిర్ణయంతో రజనీకాంత్ వారిని నిరాశ పరిచారు. పార్టీ పెట్టడం చిన్న విషయం కాదని, అందుకు కొంత సమయం పడుతుందని, కానీ 2021 నాటి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి కొంత సృష్టత ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.













