“బాబా” కోసం మళ్ళీ డబ్బింగ్ చెప్పిన రజని …
ఈ మధ్య ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్ ని థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో వారి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలని రీ మాస్టర్ చేస్తూ రీ రిలీజ్ చేస్తున్నారు. హీరోల బర్త్ డేస్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న సినిమాలు ఇన్నేళ్ల తర్వాత కూడా మంచి వసూళ్ళని రాబడుతుండడం తో చాలా మంది ఈ ట్రెండ్ ని ఫాలో అవ్వడానికి ఇష్టపడుతున్నారు.
ఈ సరికొత్త ట్రెండ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “పోకిరి” సినిమాతో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ” జల్సా “, ప్రభాస్ “రెబల్, బిల్లా, వర్షం” వంటి చిత్రాలు రీ రిలీజ్ కావడం తెలిసిందే.
ఇకపోతే నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ” చెన్నకేశవరెడ్డి ” ని కూడా ఈ తరహాలోనే రీ రిలీజ్ చేశారు. ఈ ట్రెండ్ నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తుండడంతో ప్లాప్ సినిమాలని కూడా రీ మాస్టరింగ్ చేసి మరోసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే సువర్ స్టార్ కృష్ణ నటించిన తొలి 70 ఎం ఎం మూవీ ” సింహాసనం ” రీ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా రీ రిలీజ్ ల పరంపర కొనసాగుతుంది.
ఇది ఇలా ఉండగా సువర్ స్టార్ రజిని కాంత్ హీరోగా , సురేష్ కృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ ” బాబా ” . 2022 ఆగష్టు 15 న తెలుగు , తమిళ భాషలలో రిలీజయిన ఈ చిత్రాన్ని రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు.
20 ఏళ్ళ తార్వత మరిన్ని హంగులతో ఈ చిత్రాన్ని రీలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన చిత్రాలు రీమాస్టర్ చేసి 4కె లో విడుదల చేస్తే, ” బాబా ” ని మాత్రం ఎక్స్ట్రా సీన్స్ ని జోడించి రిలీజ్ చేస్తుండడం విశేషం. తాజాగా ఈ సీన్స్ కి సంబంధించి స్వయంగా రజని డబ్బింగ్ చెప్పారు.
డబ్బింగ్ పూర్తి కావడంతో, ఆ సమయంలో తీసిన రజని ఫోటో ఒకటి నెట్టింట చెక్కర్లు కొడుతోంది. భారీ అంచనాలతో 2022 లో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు , తమిళ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ” భాషా ” లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ని రజనికి అందించిన సత్య కృష్ణ , ” బాబా “తో మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. సీన్స్ మార్చిన బాబా చిత్రాన్ని డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు.













