సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.50 లక్షల విరాళం

తమిళానాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‍ను రాష్ట్ర సచివాలయంలో సినీహీరో రజనీకాంత్ మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా తనవంతుగా సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందజేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా వైరస్ కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను విధిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.