2021 సంక్రాంతి సూపరో సూపరః …. భరి లో రజిని, చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు
జూన్ మొదటి వారం నుండి షూటింగులు షురూ… దసరా కు రిలీజ్ అనుకున్న భారీ చిత్రాలు ఈ లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయాయి కాబట్టి జూన్ మొదటి వారంలో వర్క్ స్టార్ట్ చేసి సంక్రాంతికి రెడీ అవుతున్నారు భారీ నిర్మాతలు.
సూపర్ స్టార్ రజిని కాంత్, మెగాస్టార్ చిరంజీవి, నట సింహ బాలకృష్ణ ముగ్గురు ముగ్గురే. ఈ ముగ్గురి సినిమాలు ఒకే సారి వస్తాయంటే సినీ అభిమానులకు పండగే పండగ. ముగ్గురు మాస్ హీరోలే. తమిళ్ నాడు లో సూపర్ స్టార్ రజినికి వున్నా ఫాన్స్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదు. ఇక టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికి భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇద్దరూ పోటాపోటీగా అన్ని రసాలు పండిస్తారు. ఈ ఇద్దరి మధ్య పోటీ మూడున్నర దశాబ్దాల క్రితం మొదలైంది. దాదాపుగా ఇరవై సినిమాల వరకూ ఇద్దరూ సినిమాలు ఒకే సీసన్ లో ధియేటర్లలో పోటీ పడ్డాయి. జూన్ మొదటి వారం నుండి షూటింగులు కొనసాగుతాయి కాబట్టి ఈ సారి మాత్రం ఈ ముగ్గురి మధ్యన 2021 సంక్రాంతి కి రసవత్తరమైన పోటీ జరుగబోతోందని తెలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ 2017 సంక్రాంతికి బాలయ్య సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయింది. అదే టైంలో చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 151 కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు మంచి హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టాయి.
2019 లో బాలకృష్ణ కథానాయకుడు, రజినికాంత్ పేట కూడా ఒకే నెలలో రిలీజ్ అయ్యాయి అయితే రజినీకాంత్ పేట ప్లాపు అయ్యింది. ఇక 2021 లో వచ్చే సంక్రాంతి కి ఈ ముగ్గురి హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ భారీ పోటీకి మళ్ళీ సరిగ్గా సంక్రాంతికి ముహూర్తం చూసుకుని మరీ వస్తున్నారు. 2021 సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు కూడా. రజిని కాంత్ , శివ దర్శకత్వం లో అణ్ణత్థే, చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున ఆచార్య, బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న #బ్బ ఈ మూడు సినిమాలు సంక్రాంతికి పక్కా రిలీజ్ అంటున్నారు. మొదట ఆచార్య, సినిమాను దసరా అనుకున్నారు కానీ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధిచడంతో షూటింగ్ ఆగిపోయింది. పైగా 2021 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ మూవీ వస్తుందని తగ్గాల్సివచ్చింది. అయితే ఇపుడు సమ్మర్ కి ఆర్.ఆర్.ఆర్ మూవీ వెళ్ళిపోయింది. దాంతో సంక్రాంతికి స్లాట్ ఖాళీ అయిపోయింది. దాంతో ధీమాగా ఆచార్య సంక్రాంతికి వస్తున్నాడు అంటున్నారు.
ఇక రజినీకాంత్ చాలా కాలం తరువాత రురల్ బ్యాక్డ్రాప్ తో వస్తున్న పక్క మాస్ మూవీ, సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం లో ఖుష్బూ మీనా నాయన తార కీర్తి సురేష్ వంటి పాపులర్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. ఇక బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీ మీద కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య ఏకంగా అఘోరా పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు.
ఇక ఈ మూవీ గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య క్యారక్టర్ని డిజైన్ చేశామని బోయపాటి చెబుతున్నారు. ఎన్నో సంక్రాంతిలకు బాలకృష్ణ మూవీ గ్యారంటీగా రిలీజ్ ఉంటుంది ఈ 2021 సంక్రాంతి బాలకృష్ణ చిత్రం కూడా వస్తుందని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే బాలయ్య సినిమా కూడా దసరాకు రావాలి, కరోనా లాక్ డౌన్ సేమ్ ప్రాబ్లంతో ఆగిన షూటింగు ని కంప్లీట్ చేసుకుని బాలయ్య సెంటిమెంట్ అయిన సంక్రాంతికి తీసుకురావాలనుకుంటున్నారుట.
మొత్తం మీద చూసుకుంటే ఒకేసారి ముగ్గురు టాప్ హీరోల చిత్రాలు విడుదలకు రంగం సిధ్ధం అయిందని చెబుతున్నారు.













