వినాయక చవితి సందర్భంగా ‘అణ్ణాత్త’ ఫస్ట్‌లుక్
సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం అణ్ణాత్త. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వచ్చే నెల 10వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు. రజనీకాంత్‌తో పాటు నయనతార, మీనా, ఖుష్బు, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, సూరీ, జాకీ ష్రాఫ్, గోపీచంద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించగా డి.ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.













