Rajinikanth: ఆ బుక్ చదివి కన్నీళ్లు పెట్టుకున్నా

సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) త్వరలోనే కూలీ(Coolie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రీసెంట్ రజినీకాంత్ చెన్నైలో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరై, అసలు ఇలాంటి ఈవెంట్ కు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్లో మోషన్ లో నడిచే తనను ఎందుకు పిలిచారో తెలియలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సరదాగా నవ్వించారు రజినీ.
రీసెంట్ గా తాను ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయని, అందుకే ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని చెప్పిన రజినీ ఇలాంటి ఈవెంట్లకు శివ కుమార్(Siva kumar), కమల్ హాసన్(Kamal Hassan) అయితే సరిగ్గా సరిపోతారని అన్నారు. తనకు బుక్స్ చదవాలనే ఇంట్రెస్ట్ రామకృష్ణ ఆశ్రమం వల్లే వచ్చిందని, ఇప్పటివరకు ఎన్నో గొప్ప బుక్స్ ను చదివానని, జయకంధన్(Jaya Kandhan) రాసిన ఓ బుక్ చదివి కన్నీళ్లు పెట్టుకున్నట్టు రజినీ తెలిపారు.
తన ఫ్రెండ్స్ సలహా మేరకు తాను కూడా వేల్పారి(Velpari) బుక్ చదవడం మొదలుపెట్టానని ఇప్పటికే 25% పూర్తైందని, మిగిలిన బుక్ ను మూవీస్ నుంచి రిటైర్ అయ్యాక పూర్తి చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. వేల్పారి బుక్ ఆధారంగా శంకర్(Sankar) తీయబోయే సినిమా కోసం తానెంతగానో ఎదురు చూస్తున్నానని రజినీకాంత్ ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా ప్రస్తుతం రజినీకాంత్ జైలర్2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.