రజినీ 171 కు స్పూర్తి అదేనట
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇంకా మొదలు కాకపోయినా దానిపై అప్పుడే ఓ రేంజ్ లో అంచనాలేర్పడ్డాయి. ప్రతి సినిమాకు అంతకు అంత హైప్ పెంచుకుంటూ పోతున్న ఈ ట్రెండీ డైరెక్టర్ సినిమాలో ఎన్ని లోపాలున్నా లియోను ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడన్నది అందరికీ తెలుసు.
ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లను రజినీ సినిమాకు చేయనని హామీ ఇస్తున్న లోకేష్, ఈ సినిమా కోసం ఓ ఇంగ్లీష్ మూవీ నుంచి స్పూర్తి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2013లో వచ్చిన ద పర్జ్ ఆధారంగా రజినీ171 కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అమెరికన్ గవర్నమెంట్ ఓ 12 గంటల పాటూ విచిత్రమైన జీఓను అమలు చేస్తుంది.
దాని ప్రకారం ఆ టైమ్ లో ఎలాంటి క్రిమినల్ పనులు చేసినా ఎలాంటి చర్చలూ ఉండవు. ఫోన్ చేసి ఆపదలో ఉన్నామన్నా పోలీసులు రారు. హాస్పిటల్స్ కు కాల్ చేసినా అంబులెన్స్ రెస్పాన్స్ అవవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హీరో తన కుటుంబాన్ని, తన చుట్టుపక్కల ఆపదలో ఉన్న వాళ్లను ఎలా కాపాడతాడనే పాయింట్ ఆధారంగా రూపొందింది. ఇందులోని మెయిన్ పాయింట్ ను తీసుకుని దానికి ఎన్నో మార్పులు చేర్పులు చేసి, స్క్రిప్ట్ ను రెడీ చేశాడట లోకేష్. అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమా సమ్మర్ లోగా షూటింగ్ స్టార్ట్ చేసి నాలుగైదు నెలల్లో పూర్తి చేసేలా పక్కా ప్లాన్ కూడా రెడీ అవుతోందట.













