38 ఏళ్ల తర్వాత వారి కాంబోలో మూవీ
ఎంత పెద్ద వారికైనా కొన్నిసార్లు విభేదాలు తప్పవు. ఆ విభేదాలు కూడా ఎలా ఉంటాయంటే ఏళ్లకు ఏళ్లు గ్యాప్ వచ్చేస్తుంది. అలాంటి విభేదాలే సూపర్ స్టార్ రజినీకాంత్, కట్టప్పగా అందరిక సుపరిచితుడైన సత్య రాజ్ కు మధ్య వచ్చింది. వీరిద్దరూ కలిసి గత 38 సంవత్సరాల్లో ఎప్పుడూ నటించలేదంటే వినడానికి ఆశ్చర్యమేస్తుంది. కానీ ఇది నిజం. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దీన్ని సాధ్యం చేయబోతున్నట్లు సమాచారం. 30 ఏళ్ల కిందట రజినీకాంత్ వీరా, సత్యరాజ్ సుకన్య రిలీజై రెండూ మంచి హిట్ అయ్యాయి. తన సినిమా సక్సెస్ మీట్ ను ఓ చారిత్రక ప్రదేశంలో నిర్వహించాలని ప్లాన్ చేసుకున్న సత్యరాజ్ కు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడం, అదే ప్లేస్ లో రజినీ సక్సెస్ మీట్ కు పర్మిషన్ ఇవ్వడం చేయడంతో కర్ణాటక నుంచి వచ్చిన బయటివ్యక్తిని తమిళనాడు ప్రభుత్వం నెత్తిన పెట్టుకుందని విమర్శలు చేశారు.
తర్వాత శివాజీలో విలన్ పాత్రకు ఎక్కువ రెమ్యూనరేషన్ తో సత్యరాజ్ ను సంప్రదించారు. రజినీ కూడా ఓకే అన్నాడు. ఆ టైమ్ లో సత్య రాజ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ సినిమా చేయడానికి నో అని ఖరాఖండిగా చెప్పేశాడు. రజినీని సీఎంగా చూడటం కంటే మరో ఘోరముండదని సత్యరాజ్ అన్నట్లు మీడియాలో ఎన్నో కథనాలొచ్చాయి. అలా వారిద్దరి కాంబో గత 38 ఏళ్లలో సాధ్యపడలేదు. ఇప్పుడు లోకేష్ ఆ కాంబోని సాధ్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. కూలి సినిమాలో వీరిద్దరూ ఫ్రెండ్స్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.













