దర్బార్ లో సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల
రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి దర్బార్ అనే పేరు ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సుభాస్కరన్ నిర్మాత. టైటిల్ లోగోతో పాటు ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రమని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే ఫస్ట్‌లుక్ నిశితంగా గమనిస్తే పోలీసు దుస్తులు, బెల్టు, తుపాకీ, జాగిలం కనిపిస్తూ ఇదో పోలీస్ కథ అని సూచిస్తున్నాయి. రజనీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారా? అనే ఆసక్తి కలుగుతోంది. గుడ్, బ్యాడ్, అగ్లీ.. వీళ్లలో ఎలా ఉండడం నీకు ఇష్టమో నువ్వే తేల్చుకో అనే సందేశం ఫస్ట్‌లుక్ పోస్టర్లో కనిపిస్తోంది. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఛాయాగ్రహణం: సంతోష్ శివన్, కూర్పు: శ్రీకర ప్రసాద్.













