విలన్ రోల్స్‌కు రాజశేఖర్ రెడీ
ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ గత కొంత కాలంగా ఫామ్ లో లేకుండా పోయాడు. సొంత బ్యానర్ లో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నించారు కానీ అవేమీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో రాజశేఖర్ ఇక హీరో ప్రయత్నాలు ఆపేసి కీ రోల్స్ చేస్తే బెటర్ అని అందరూ అనుకున్నారు కూడా.
రాజశేఖర్ కూడా తనకు పవర్ఫుల్ రోల్స్ వస్తే చేయాలని చాలా కాలంగా ఎదురుచూశాడు కానీ ఆ విధంగా కూడా ఆయనకు మంచి ఛాన్సులు రాలేదు. అయితే ఇప్పుడు రాజశేఖర్ విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్లు ఆయన కూతురు శివాని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నితిన్ సినిమాలో రాజశేఖర్ చేస్తున్న రోల్ చాలా పరవర్ఫుల్ గా ఉంటుందని కూడా శివాని వెల్లడించింది.
మంచి పాత్రలొస్తే క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడని, నచ్చిన పాత్రలు వస్తే విలన్ గా చేయడానికి కూడా తమ తండ్రి రెడీగా ఉన్నాడని తెలిపింది. ఎక్స్ట్రా తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రాజశేఖర్ వచ్చిన ఛాన్స్ వచ్చింది కదా అని అన్నీ చేసేయకుండా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.













