అప్పుడే ఎందుకంటున్న రాజమౌళి
గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని వెయిట్ చేస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పేట్లు లేదని అంతర్గత వర్గాలంటున్నాయి. ప్రస్తుతం SSMB29కు సంబంధించిన వర్క్ షాప్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన గ్రీన్ మ్యాట్ వర్క్స్ తో పాటూ బయట తీయాల్సిన సీన్స్ గురించి స్టంట్ మాస్టర్లు, టెక్నీషియన్స్ తో కలిసి డిస్కషన్స్ జరుపుతున్నట్లు సమాచారం. మహేష్ బర్త్ డే సందర్భంగా సినిమాను అనౌన్స్ చేయాలనుకోవడం మంచి సందర్భమే అయినప్పటికీ అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియనప్పుడు అంత తొందరెందుకని రాజమౌళి భావిస్తున్నాడట.
దానికి మహేష్ కూడా మద్దతు తెలపడంతో ఈసారి మహేష్ బర్త్ డే కేవలం మురారి రీరిలీజ్ తోనే ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మహేష్ ను మళ్లీ స్క్రీన్ పై చూడటానికి కనీసం రెండు మూడేళ్లైనా పడుతుందనే కారణంతో ప్రతీ రీరిలీజ్ ను మహేష్ ఫ్యాన్స్ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడయ్యారు.













