మహేష్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న రాజమౌళి
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో జత కట్టనున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే మహేష్ ఈ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. రీసెంట్ గా యూరప్ ట్రిప్ వెళ్లి ఫిట్నెస్ వర్క్ షాప్ కూడా చేసొచ్చాడు.
ఇప్పటికే కథ రెడీ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. సినిమాలో ఇతర టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ లను ఎంపిక చేసే పనిలో ఉంది రాజమౌళి బృందం. అయితే ఎన్నో ఏళ్లుగా రాజమౌళితో కలిసి పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఈ సినిమాకు దూరం అవుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
ఇప్పటికే కెమెరా మెన్ సెంథిల్ ఈ సినిమాకు దూరమయ్యాడు. ఆయన ప్లేస్ లోకి పిఎస్ వినోద్ వచ్చాడు. ఈయన కూడా మచి సినిమాటోగ్రాఫరే అయినా సెంథిల్ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వగలడా అనే అనుమానాలు ఫ్యాన్స్ లో నెలకొంటున్నాయి. అంతేకాదు వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అయిన శ్రీనివాస్ మోహన్ ప్లేస్ లోకి కమల్ కణ్ణన్ వచ్చాడట. వీరిద్దరితో పాటూ ప్రొడక్షన్ డిజైనర్ కూడా మారినట్లు వార్తలొస్తున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్లేస్ లోకి మోహన్ అనే టెక్నీషియన్ వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ ఆకాశవాణి అనే చిన్న సినిమాకు పని చేశాడు. కానీ సాబు సిరిల్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుంది. ఆయన ప్లేస్ లోకి చిన్న సినిమాకు వర్క్ చేసిన అతణ్ని తీసుకురావడంతో మహేష్ ఫ్యాన్స్ కు ఎక్కడ లేని డౌట్స్ వస్తున్నాయి.













