షూటింగ్ రిహార్సల్స్ మొదలు పెట్టిన రాజమౌళి
సినిమా సినిమాకూ మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకునే రాజమౌళి(Rajamouli) తన తర్వాతి సినిమాను మహేష్ బాబు((Mahesh Babu) తో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ తో సినిమాను స్టార్ట్ చేయడానికే రాజమౌళి మూడేళ్లు తీసుకున్నాడు. రిలీజ్ కు ఎంతలేదన్నా మరో రెండేళ్లు పట్టొచ్చు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కొన్ని నెలల ముందే పూర్తవగా టీమ్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీ గా ఉంది.
ఈ ఇయర్ ఎండింగ్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఈలోపు రాజమౌళి షూటింగ్ రిహార్సల్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో డమ్మీ ఆర్టిస్టులతో ప్రారంభించేశాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ సినిమాకు తగ్గట్టు ఫిల్మ్ సిటీలో చిన్న పాటి సెట్స్ వేసి గుర్రాలతో అక్కడ డమ్మీ షూట్ చేస్తున్నాడట రాజమౌళి.
కొన్ని కీలక సీన్స్ ను ఇలా డమ్మీగా తీస్తే, అసలు సీన్స్ పై ఫుల్ క్లారిటీ వస్తుందనేది రాజమౌళి ఆలోచన. దానికి తోడు రాజమౌళి ఈసారి సినిమాటోగ్రాఫర్ ను కూడా మార్చాడు. సెంథిల్(Senthil) అందుబాటులో లేకపోవడంతో పీఎస్ వినోద్(PS Vinod) ను తీసుకున్నాడు. ఈ షూట్ ద్వారా ఆయనతో సింక్ కూడా చూసుకోకున్నాడు రాజమౌళి. మొత్తానికి మహేష్ సినిమా కోసం రాజమౌళి చాలా పకడ్బందీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.













