సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన జక్కన్న
కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు 29 గురించి అనౌన్స్మెంట్ వస్తుందని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ చూశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అప్డేట్ రాకపోవడంతో వారందరికీ నిరాశే మిగిలింది. మహేష్29 అనౌన్స్మెంట్ రావడానికి మరికొంత కాలం పట్టనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కృష్ణ బర్త్ డే రోజునే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇద్దామనుకున్నారు కానీ దానికి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో అనౌన్స్మెంట్ ను వాయిదా వేశారు.
అంతేకాదు దీనికి వేరే కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు సైలైంట్ అయిన థియేటర్లలోకి కృష్ణ బర్త్ డే రోజునే మూడు సినిమాలు రిలీజవడంతో మీడియా దృష్టంతా వాటిపైనే ఉంది. మరోవైపు కల్కి హంగామా కూడా స్టార్ట్ అయిపోయింది. మరోవైపు ఎలక్షన్ ఫలితాలు రానున్నాయి. ఇలాంటి వాటి మధ్య సినిమాను అనౌన్స్ చేసి రావాల్సిన దానికంటే తక్కువ అటెన్షన్ ను ఎందుకు పొందాలని రాజమౌళి అనౌన్స్మెంట్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్స్, కాస్టూమ్స్ ఫోటో షూట్ చేస్తూనే క్యాస్టింగ్ పనులను కూడా చూసుకుంటున్నాడు రాజమౌళి. ఆర్టిస్టులను ఫైనల్ చేయాలి, వారి డేట్స్ అడ్జస్ట్ అయేలా ప్లాన్ చేసుకోవాలి. రెమ్యూనరేషన్స్, బడ్జెట్ అన్నీ చూసుకోవాలి. చూస్తుంటే సినిమా అనౌన్స్మెంట్ కోసం ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టిన రోజు వరకు వెయిట్ చేయాల్సి వస్తుందోమో మరి.













