Rajamouli: రాజమౌళి క్లారిటీ ఇస్తే బెటర్
రాజమౌళి(Rajamouli) తన సినిమాల విషయంలో, దాని ప్రమోషన్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా అనౌన్స్మెంట్ తోనే కావాల్సిన హైప్ ను తెచ్చుకుంటాడు. రాజమౌళి ఏదైనా సినిమాను మొదలుపెట్టే ముందే ప్రెస్ మీట్ పెట్టి మూవీకి సంబంధించిన వివరాలు, దానికి వర్క్ చేసే యాక్టర్లు, టెక్నీషియన్లు, చిత్ర కథాంశాన్ని ముందుగానే రివీల్ చేస్తాడు.
గతంలో ఆర్ఆర్ఆర్(RRR) సినిమాకు కూడా రాజమౌళి ఇదే చేశాడు. కానీ ఇప్పుడు రాజమౌళి(Rajamouli) మహేష్(Mahesh) తో చేస్తున్న సినిమా కోసం తన పాత ఫార్ములాని పూర్తిగా పక్కనపెట్టాడు. ఇంకా చెప్పాలంటే రాజమౌళి ఈ సినిమాను అనౌన్స్ కూడా చేయకుండానే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశాడు. అసలు మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండా రాజమౌళి సినిమాను మొదలుపెట్టడమే ఆశ్చర్యంగా ఉంటే రీసెంట్ గా సెట్స్ నుంచి వీడియో లీకైనా కూడా రాజమౌళి దానిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం అందరినీ మరింత ఆశ్చర్యపరుస్తుంది.
ఈ నేపథ్యంలో రాజమౌళి అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా విషయంలో అందరికీ ఉన్న డౌట్స్ ను తీర్చేస్తే అన్నింటికీ బావుంటుంది. ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా కె.ఎల్ నారాయణ(KL Narayana) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.













