Rajamouli: రాజమౌళి ఏదైనా అప్డేట్ ఇస్తాడా?
రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(mahesh babu) కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లి రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఎప్పుడూ లేనిది మహేష్ ఈ సినిమా కోసం పూజా కార్యక్రమాలకు కూడా హాజరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. షూటింగ్ మొదలై, రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నప్పటికీ రాజమౌళి కనీసం ఈ సినిమా అధికారికంగా ప్రకటించింది కూడా లేదు.
దీంతో మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎస్ఎస్ఎంబీ29(SSMB29) కు సంబంధించిన అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజమౌళి హిట్3(Hit3) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నాడు. హిట్3 స్టేజ్ పై జక్కన్న(Jakkanna) మహేష్ ఫ్యాన్స్ కు ఏమైనా హింట్ ఇస్తాడేమో అని ఆతృతగా ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం తను అనుకున్నప్పుడే ఏదైనా బయటకు చెప్తాడనే విషయం తెలిసిందే.
నాని(Nani) ఈవెంట్ కు వచ్చి ఆ సినిమా గురించి మాట్లాడి వెళ్తాడు తప్పించి మహేష్ మూవీ గురించి మాత్రం చెప్పే ఛాన్స్ ఉండదు. కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎస్ఎస్ఎంబీ29 అప్డేట్ గురించి మర్చిపోవడం బెటర్. ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ29 టీమ్ త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లనుంది. ఇప్పటికే దానికి సంబంధించిన వీసా ఏర్పాట్లు, ఇంటర్నేషనల్ లైసెన్స్ వర్క్స్ పూర్తయ్యాయి. మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.






