మహేష్కే మినహాయింపు ఎందుకంటే..?
రాజమౌళి(Rajamouli)తో ఓ హీరో సినిమా చేస్తున్నాడంటే ఆ హీరో బయట కనిపించడం చాలా అరుదు. రాజమౌళి పర్మిషన్ లేకుండా కనీసం మరో షూటింగ్ లో కూడా సదరు హీరో పాల్గొనడానికి లేదు. ఆర్ఆర్ఆర్ టైమ్ లో ఆచార్య(Acharya) స్పెషల్ క్యామియో కోసం చిరంజీవి(Chiranjeevi) స్పెషల్ రిక్వెస్ట్ వల్ల రామ్ చరణ్(Ram Charan) కు రాజమౌళి పర్మిషన్ ఇచ్చాడు.
కానీ మహేష్ బాబు(Mahesh Babu)కు మాత్రం అలాంటి కండిషన్స్ ను రాజమౌళి పెట్టలేదు. మహేష్ ఎక్కడంటే అక్కడ చాలా ఫ్రీగా తిరిగేస్తున్నాడు. రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసినప్పుడు మహేష్ లుక్ ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే రాజమౌళి, మహేష్ కు స్పెషల్ మినహాయింపు ఇవ్వడం వెనుక చాలా పెద్ద కథే ఉంది.
టీమ్ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం సినిమాలో మహేష్ లుక్ ఇప్పుడు మనం చూస్తున్న మహేష్ లుక్ ఒకటి కాదట. జులపాల జుట్టు, గుబురు గెడ్డం, మీసం పెంచాక ఫైనల్ గా తనకు కావాల్సిన లుక్ కోసం విదేశాల నుంచి హెయిర్ స్టయిలిస్ట్ లను పిలిపించి ఓ ఫోటో షూట్ ను చేసి వాటి మీద ఫారిన్ ఎక్స్పర్ట్స్ తో వివిధ ఆప్షన్స్ తో డిజైన్స్ చేయించే పనిలో ఉన్నాడట రాజమౌళి. వాటిలో బెస్ట్ ను సెలెక్ట్ చేసి అప్పుడు మహేష్ ని ఆ గెటప్ లోకి తీసుకొస్తాడట జక్కన్న. ఇదంతా అయ్యాక మహేష్ ను రాజమౌళి బయటకు వదిలే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఇదంతా జరగడానికి మరో రెండు మూడు నెలలు టైమ్ పట్టేలా ఉంది.













