రాజమౌళి-మహేష్ మూవీ టైటిల్ అదేనా?
గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తన తర్వాతి సినిమాను దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్తైనా సరే ఫ్యాన్స్ ను తెగ ఎగ్జైట్ చేస్తోంది. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటూ సగటు సినీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో భాగస్వామ్యం కోసం పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు సైతం ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి తాజాగా నెట్టింట ఓ వార్త ప్రచారం లోకి వచ్చింది. మహేష్-రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు మహారాజా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ టైటిల్ వార్త నిజమైతే మాత్రం ఈ టైటిల్ మహేష్ కు సరిగ్గా సరిపోతుంది.
ఇది కాకుండా చక్రవర్తి అనే టైటిల్ ను కూడా చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఖరికి టైటిల్ గా రాజమౌళి దేనికి ఫిక్స్ అవుతాడో చూడాలి. ప్రస్తుతం మహేష్ మేకోవర్ లో బిజీగా ఉంటే, రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను ప్రెస్ మీట్ పెట్టి రివీల్ చేయనున్నాడు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.













