సేమ్ ఫార్ములాతో ముందుకెళ్తున్న రాజమౌళి
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఆగస్ట్ నుంచి ఆరు నెలల పాటూ చిత్ర యూనిట్ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి ప్రతి సినిమాకూ వర్క్ షాప్ నిర్వహిస్తాడు. రిహార్సల్ పర్ఫెక్ట్ అయ్యాకే షూటింగ్ కు వెళ్తాడు. అందుకే రాజమౌళి తను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలడు. రాజమౌళి చేసే ప్రతి పెద్ద సినిమాకు ఈ వర్క్ షాప్స్ ఎంతో బాగా ఉపయోగపడ్డాయి. అందుకే ఇప్పుడు మహేష్ తో చేయబోయే సినిమాకు కూడా ముందు ఆరు నెలలు వర్క్ షాప్ చేసిన తర్వాతే రెగ్యులర్ షూట్ కు వెళ్లాలని చూస్తున్నాడట రాజమౌళి.
ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే దీని కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించుతున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ను మెప్పించడంతో దాన్ని మించేలా మహేష్ తో ఈ సినిమాను తీయాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. సినిమా అనౌన్స్ చేస్తే కానీ దానికి సంబంధించిన మిగిలిన వివరాలు తెలియవు.













