ఫిలిం సిటీ మీద జక్కన్న చూపు
రాజమౌళి బాహుబలి సినిమాకు దృశ్య రూపం ఇవ్వడంలో ఎంతో తోడ్పడిన ప్లేస్ ఏదంటే ఎవరైనా సరే వెంటనే రామోజీ ఫిలిం సిటీ అని చెప్తారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఫిలిం స్టూడియోలో షూటింగ్ కు లేని ఫెసిలిటీ లేదు. ఎంత పెద్ద ప్లేస్ కావాలన్నా, ఎలాంటి సెట్ వేయాలన్నా, ఎంతమందితో షూటింగ్ చేయాలన్నా ఇక్కడ ఎలాంటి సమస్యా ఉండదు.
పైగా పబ్లిక్ వస్తారనే ఇబ్బంది అసలుండదు. కాకపోతే మిగిలిన స్టూడియోలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు, రూల్స్ ఎక్కువ. బాహుబలి కోసం మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఫిలిం సిటీలోనే సెట్ వేసి మెజారిటీ షూటింగ్ అక్కడే చేశాడు రాజమౌళి. బాహుబలి బడ్జెట్ లో పావు వంతు బడ్జెట్ ఫిలిం సిటి అద్దెకే ఇచ్చారని కూడా అప్పట్లో టాక్ వినిపించింది.
ఆ టైమ్ లోనే రాజమౌళికి రామోజరావుతో మంచి అనుబంధం ఏర్పడింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆర్ఆర్ఆర్ కోసం మాత్రం జక్కన్న ఫిలిం సిటీకి వెళ్లలేదు. దీంతో బాహుబలి బిల్స్ విషయంలో ఇద్దరి మధ్య చిన్న విభేదాలొచ్చాయని అందుకే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫిలిం సిటీకి వెళ్లకుండా బయటే చేశారని అంటారు. అందులో నిజమెంతున్నది తెలియదు కానీ ఇప్పుడు రాజమౌళి, మహేష్ తో చేయబోతున్న తన తర్వాతి సినిమా కోసం ఫిలిం సిటీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మహేష్-రాజమౌళి సినిమా షూటింగ్ చాలా వరకు అక్కడే జరుగుతుందని ఇప్పటికే అక్కడ సెట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.













