మహేష్ ఫ్యాన్స్ కు మరో మూడేళ్ల వెయిటింగ్
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించనున్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లలేదు కానీ దీనిపై అంచనాలు మాత్రం ఇప్పటినుంచే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే ఓ వార్త ఈ సినిమా గురించి బాగా ప్రచారమైంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప మరేం లేదని అందరికీ తెలిసిన విషయమే. మహేష్ ఫ్యాన్స్ కు తప్ప గుంటూరు కారం సాధారణ సినిమా ప్రేక్షకులకు నచ్చదనేది వాస్తవం. ఇలాంటి గుంటూరు కారం తర్వాత మహేష్, రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.
రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు రాజమౌళి. అందుకే ఆయన సినిమాలకు అంత క్రేజ్ ఉంటుంది. ఇప్పటిక ఏఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసిన రాజమౌళి త్వరలోనే మహేష్ తో కలిసి సెట్స్ మీదకు వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఎంత త్వరగా అనుకున్నా ఈ సినిమా రెండేళ్ళు షూటింగ్, ఒక ఏడాది పాటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే మొత్తం మూడేళ్లు ఈ సినిమా కోసం మహేష్ వెచ్చించాల్సి ఉంటుంది. అంటే 2027 వరకు మహేష్ నుంచి మరో సినిమా వచ్చే అవకాశం లేదు. సో మహేష్ ఫ్యాన్స్ కు మూడేళ్ల వరకు వెయిటింగ్ తప్పేలా లేదు.













