టీజర్లో రాజావారు రాణిగారు
గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరులో రేషన్ డీలర్ కుమార్తెతో ఆర్ఎంపీ డాక్టర్ కుమారుడు ప్రేమలో పడతారు. వారి ప్రేమకు సహాయం చేసిందేవరు? ప్రేమ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం రాజువారు రాణిగారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ జంటగా నటించారు. రవికిరణ్ కోల దర్శకుడు. డి.మనోవికాస్ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలో ట్రైలర్, సినిమా విడుదల తేదీలు ప్రకటిస్తాం అని మనోవికాస్ అన్నారు. ఈ చిత్రానికి జే క్రిష్ సంగీత దర్శకుడు.













