Raja Saab2: రాజా సాబ్2 ఉంటుంది. కానీ..
ఈ మధ్య టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అందులో భాగంగానే కాస్త క్రేజ్ ఉన్న సినిమాలన్నింటికీ సీక్వెల్స్ ను అనౌన్స్ చేసి దాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభాస్(prabhas) హీరోగా మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్(The Rajasaab) కు కూడా సీక్వెల్ ఉంటుందని కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై నిర్మాత టిజి విశ్వప్రసాద్(TG Viswa prasad) క్లారిటీ ఇచ్చారు.
రాజాసాబ్2 ఉంటుందని చెప్పిన విశ్వ ప్రసాద్, ఆ విషయంలో అందరికీ మరింత క్లారిటీ ఇచ్చారు. రాజాసాబ్2(raja saab2) ఉంటుందని కానీ అది రాజాసాబ్ సినిమాకు సీక్వెల్ కానీ, కొనసాగింపు కానీ కాదని, ఒక కొత్త కథతో వేరే ప్రపంచంలో దాన్ని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. దీంతో రాజాసాబ్ సీక్వెల్ వార్తలపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టైంది.
రాజా సాబ్ షూటింగ్ పాటలు మినహా దాదాపు పూర్తైందని, రా ఫుటేజ్ 4 గంటల 30 నిమిషాలు వచ్చిందని, పెద్ద సినిమా దేనికైనా అది కామనే అని, దాన్ని ఎడిట్ చేసి సాధారణ సినిమాగా చేయాలని చెప్పిన ఆయన ఈ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని రాజా సాబ్ మెప్పిస్తుందని వెల్లడించారు.







