Raja Saab: రాజా సాబ్ ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా మారుతి(maruthi) దర్శకత్వంలో చేస్తున్న సినిమా ది రాజా సాబ్(the raja saab). హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా తర్వాత్తర్వాత రాజా సాబ్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ ను మారుతి వింటేజ్ లుక్ లో ప్రెజెంట్ చేయడంతో పాటూ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఆడియన్స్ ను ఎంతగానో మెప్పించింది.
అయితే ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు జనవరి 9కి సినిమా వాయిదా పడిందంటున్నారు. అయితే రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉండగానే మేకర్స్ రాజా సాబ్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారట. అందులో భాగంగానే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
దాని కోసం రాజా సాబ్ నిర్మాతలు మంచి ప్లాన్ వేశారు. రాజా సాబ్ ట్రైలర్(raja saab trailer) ను రిషబ్ శెట్టి(rishab shetty) హీరోగా వస్తున్న కాంతార చాప్టర్1(kanthara chapter1) సినిమాకు ఎటాచ్ చేయనున్నట్టు రీసెంట్ గా నిర్మాత విశ్వప్రసాద్(T.G. Viswaprasad) వెల్లడించారు. కాంతార(kanthara) సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాతో రాజా సాబ్ ట్రైలర్ ను ఎటాచ్ చేస్తే మంచి పబ్లిసిటీ వస్తుందనే ఆలోచనతో ఈ ప్లాన్ వేసినట్టు అర్థమవుతుంది. దాంతో పాటూ ప్రభాస్ బర్త్ డే కు రాజా సాబ్ నుంచి ఫస్ట్ లిరికల్(raja saab first lyrical) ను రిలీజ్ చేసే ఆలోచన కూడా ఉందని ఆయన తెలిపారు. నిర్మాత ఇచ్చిన ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.