Prabhas: రాజా సాబ్ టీజర్ ఎప్పుడంటే?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory)కి ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో ఎక్కువగా నష్టాలు చూసిన నిర్మాణ సంస్థ ఇదే. దీంతో పీపుల్ మీడియా ఆశలన్నీ ప్రభాస్(Prabhas)- మారుతి(maruthi) కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్(the Raja Saab) సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా తమ నష్టాలన్నింటినీ రికవర్ చేస్తుందని నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
హార్రర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. మొదట్లో మారుతిపై నమ్మకం లేకపోయినప్పటికీ తర్వాత పర్ఫెక్ట్ హార్రర్ స్టోరీ అని తెలిశాక అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాకుండా రాజా సాబ్ లో లవర్ బాయ్ సీన్స్, కామెడీ సమానంగా ఉంటుందని కూడా చెప్పడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి క్రిస్మస్ కు టీజర్(Raja saab teaser) రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. రాజా సాబ్ నుంచి రానున్న ఈ టీజర్ సినిమా బిజినెస్ కు చాలా కీలకం కానుంది. టీజర్ కట్ లో ప్రభాస్ కటౌట్‌కు హార్రర్, కామెడీ టచ్ ను పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తే సినిమాపై బజ్ అమాంతం పెరగడం ఖాయం. ఇంకా సినిమాకు బిజినెస్ జరగలేదు కాబట్టి టీజర్ తర్వాత అనుకున్న రేట్లకు అమ్మాలని నిర్మాతలు చూస్తున్నారు. ఈ మధ్య హార్రర్ సినిమాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రాజా సాబ్ లో మంచి కంటెంట్ ఉంటే కలెక్షన్లు రూ.1000 కోట్లు దాటడం చాలా తేలిక. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.













