తెలివిగా ప్లాన్ చేస్తున్న రాజా సాబ్
కల్కి 2898ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి2 తర్వాత కల్కితో మరో రూ.1000 కోట్లు అందుకున్నాడు ప్రభాస్. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా రాజా సాబ్. వీలైనంత మేరకు రాజా సాబ్‌ను ఈ ఇయర్ ఎండింగ్ లోపు లేదా నెక్ట్స్ ఇయర్ జనవరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. రాజా సాబ్ విషయంలో మేకర్స్ నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఎప్పుడు రిలీజవుతుందనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ ఎప్పుడు రిలీజైనా మిగిలిన సినిమాలన్నీ తప్పుకోక తప్పదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో రాజా సాబ్ పై భారీ అంచనాలుంటాయి.
రాజా సాబ్ ను ఎట్టి పరిస్థితుల్లో నవంబర్‌కు పూర్తి చేసి డిసెంబర్ 20న లేదా జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే క్రిస్మస్ రేసులో సినిమాలున్నాయి కాబట్టి ప్రభాస్ సినిమాను క్రిస్మస్కు ఐదు రోజుల ముందు రిలీజ్ చేయాలని చూస్తున్నారట. డిసెంబర్ లో కుదరకపోతే జనవరి మొదటి వారంలో అంటే 5,6 తేదీల్లో రాజా సాబ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా డైరెక్టర్ మారుతి ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.













