Raja Saab: దసరాకు గురి పెట్టిన రాజా సాబ్
బాహుబలి(Baahubali) సినిమా తర్వాత ప్రభాస్(Prabhas) రేంజ్ బాగా పెరిగిపోయింది. యంగ్ రెబల్ స్టార్ నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. గతేడాది కల్కి(Kalki) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డార్లింగ్ ప్రస్తుతం మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The Raja Saab), హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji)(వర్కింగ్ టైటిల్) అనే సినిమాలు చేస్తున్నాడు.
అయితే రాజా సాబ్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకున్నట్టు ఆ మధ్య ఓ ఈవెంట్ లో మారుతి తెలిపాడు. తాజా సమాచారం ప్రకారం రాజా సాబ్ షూటింగ్ మరో 25 రోజుల పాటూ పెండింగ్ ఉందట. ప్రభాస్ కాల్షీట్ల వీలును బట్టి ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను త్వరలోనే షూట్ చేయనున్నట్టు సమాచారం.
హార్రర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దసరా అయితే సెలవులు కూడా కలిసొస్తాయి కాబట్టి కలెక్షన్ల పరంగా కూడా బావుంటుందని ఆలోచిస్తున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Niddhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు.













