Raja Saab: కొత్త ఆలోచనలో రాజా సాబ్ మేకర్స్
మారుతి(maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) చేస్తున్న సినిమా ది రాజాసాబ్(the raja saab). ప్రభాస్ కెరీర్లోనే మొదటి సారి హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రాజా సాబ్ మేకర్స్ మరో ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం రాజా సాబ్ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ అక్టోబర్ ఆఖరికి పూర్తవుతాయని తెలుస్తోంది. అక్టోబర్, నవంబర్ లో చిన్న చిన్న వర్క్స్ ను పూర్తి చేసి డిసెంబర్ కు సినిమా ఫస్ట్ కాపీని రెడీ చేయాలని చూస్తున్నారట. అన్నీ చూసుకుని సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తే బావుంటుందనే ఆలోచన మేకర్స్ లో ఉందట. అదే నిజమైతే రాజా సాబ్ మరోసారి వాయిదా పడటం ఖాయం.
అయితే ఇప్పటికే సంక్రాంతికి పలు సినిమాలు కర్ఛీఫ్ వేసుకుని ఉన్న నేపథ్యంలో రాజా సాబ్ కూడా సంక్రాంతికే వస్తే కలెక్షన్లపై ఆ ప్రభావం ఉండే అవకాశముంది. మరి నిర్మాతలు ఏం ఆలోచిస్తున్నారో చూడాలి. నిధి అగర్వాల్(Niddhi Agerwal), మాళవిక మోహనన్(malavika mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్(thaman) సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.







