సమ్మర్ రేస్ ను స్టార్ట్ చేసిన డార్లింగ్
ఎప్పుడో రిలీజ్ కానున్న సినిమాలు కూడా ముందుగానే రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేసుకుని బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. సంక్రాంతికి కనీసం ఆరు నెలల ముందే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటున్నారు. తర్వాత అవసరమైతే మార్చుకోవచ్చులే అని ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. సమ్మర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.
చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది వేసవికి బాలీవుడ్ నుంచి ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోగా టాలీవుడ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఏ సినిమా ఆ సీజన్ కు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి అడుగు ప్రభాస్ వేశాడు. రాజా సాబ్ రిలీజ్ డేట్ టెన్షన్ ను తెర దించుతూ చిన్న గ్లింప్స్ తో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజా సాబ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే కల్కివచ్చిన 10 నెలలకే ఇంకో సినిమాతో ప్రభాస్ రాబోతున్నాడన్నమాట. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టే మిగిలిన సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి 2025 సమ్మర్ రేస్ ను ప్రభాస్ స్టార్ట్ చేశాడు. మిగిలిన సినిమాలు కూడా ఆ సీజన్లోకి రావాల్సి ఉంది. డిసెంబర్ నుంచి తండేల్ పోస్ట్ పోన్ అయితే సంక్రాంతికి లేదా సమ్మర్ కు రావాల్సిందే. గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో మిస్సయితే సమ్మర్ రిలీజే ఉంటుంది. ధనుష్ కుబేర కూడా సమ్మర్ కే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ టాక్సిక్ ను సమ్మర్ టార్గెట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. త్వరలోనే నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్ల విషయంలో క్లారిటీ రావొచ్చు.













