అప్పుడే అంత చేసేశావా రాజా
సలార్, కల్కి సినిమాలతో పాటూ పాన్ ఇండియా స్టార్, డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కనీసం పూజా కార్యక్రమాలు, అనౌన్స్మెంట్ కూడా లేకుండానే స్టార్ట్ అయిపోయింది. అలా స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 40% పూర్తి అయినట్లు తెలుస్తోంది.
రాజా డీలక్స్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. కల్కి షూటింగ్ పూర్తయ్యాక ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడట. రాజా డీలక్స్ షూటింగ్ మొతతం ఓ ప్యాలెస్ నేపథ్యంలో జరగనుందట. ఈ సినిమా మీద అటు మారుతి, ఇటు ముగ్గురు హీరోయిన్లు చాలానే ఆశలు పెట్టుకున్నారు. మరి అందరి ఆశలను రాజా డీలక్స్ ఎంత వరకు తీరుస్తుందో చూడాలి.













