Raj Kundra: ట్రోల్స్ పై రియాక్ట్ అయిన రాజ్ కుంద్రా
ఆధ్మాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్(Premanand Maharaj) కు రెండు కిడ్నీలు పాడైపోయి గత పదేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో ఆయన పాపులారిటీ చాలా ఎక్కువ. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఆయన దగ్గరకు వెళ్తుంటారు. రీసెంట్ గా బాలీవుడ్ జంట శిల్పా శెట్టి(Shilpa Shetty)- రాజ్ కుంద్రా(Raj Kundra) ఆయన ఆశ్రమాన్ని సందర్శించారు.
సందర్శనలో భాగంగా రాజ్ కుంద్రా స్వామీజీకి తన కిడ్నీ దానం చేస్తానని చెప్పడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. రాజ్ కుంద్రా వ్యాఖ్యలపై కొందరు ట్రోల్స్ చేయగా తాజాగా ఆ ట్రోల్స్ పై ఆయన రియాక్ట్ అయ్యారు. ఒకరి ప్రాణాలు కాపాడటానికి తాను చెప్పిన మాటల్ని కూడా ఎగతాళి చేస్తున్నారంటే తానెలాంటి వింత ప్రపంచంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
దీన్ని కూడా పీఆర్ స్టంట్ అని ట్రోల్ చేస్తున్నారని, మానవత్వాన్ని కూడా స్టంట్ అంటున్నారని, ఈ విషయంలో ఎవరెన్ని అన్నా తానేం ఫీల్ అవనని, నెటిజన్లు చేసే వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయలేవని, ఎవరినీ ఎట్రాక్ట్ చేయడానికి తాను అలా మాట్లాడలేదని, ఎదుటివారి గురించి వీలైనంత తక్కువగా మాట్లాడమని, ఎక్కువ ప్రేమను పంచమని, అప్పుడే ఇంకొకరి లైఫ్ లో వెలుగులు నింపుతారని ఆయన పేర్కొన్నారు.
https://www.instagram.com/stories/onlyrajkundra/3699661624603436476/?hl=en







