వ్యవసాయం దండగ కాదు పండుగ.. 14న వస్తున్న ‘రైతన్న’
వ్యవసాయం దండగ కాదు, పండగ అనే రోజు రావాలంటూ తీసిన చిత్రమే రైతన్య అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాల్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ రైతన్న తీశా అన్నారు. రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు అన్నారు. ఇప్పుడు ఆ కర్షకుడికి స్థానం ఎక్కడుంది? రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని, అన్నం పెట్టే అన్నదాతకి గిట్టుబాటు ధర కావాలని, కేంద్ర ప్రభుత్వం డా.స్వామినాథన్ కమిటీ సిఫార్సులని అమలు చేయాలనే డిమాండ్‌ని ఇందులో బలంగా ప్రస్తావించాం. అందరిలోనై ఆలోచన రేకెత్తించే ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం అన్నారు.













