వాళ్లని సాటిసిఫై చేయ లేకపోయానన్న రాహుల్
రాహుల్ రవీంద్రన్ ఊహించిన స్థాయిలో విజయం దక్కించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. హీరోగా, నటుడిగా వర్కవుట్ అవట్లేదనే ఉద్ధేశ్యంతో చివరకు దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. అక్కినేని కాంపౌండ్ లో చిలసౌ అనే సినిమాను చేశాడు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఆ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నాగార్జునతో మన్మథుడు2 సినిమా తీసి ఘోర పరాజయంను ఎదుర్కోవల్సి వచ్చింది.
మన్మథుడు2 వచ్చి చాలా కాలమైనా కూడా ఇప్పటివరకు రాహుల్ డైరక్టర్ గా తన తర్వాతి సినిమాను ప్రకటించలేదు. ఇటీవలే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో రాహుల్ ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా సోషల్ మీడియా లో లైవ్ కి వచ్చిన రాహుల్ కు ఒక ప్రశ్న ఎదురైంది. నాగార్జునతో గతంలో ఒక సినిమా చేస్తానని చెప్పారు అదెప్పుడని అడగ్గా.. మన్మథుడు2 ఎఫెక్ట్ ఇంకా పోలేదు. ఆ సినిమా వల్ల ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ తిట్టుకుంటూనే ఉన్నారు. నాగ్ సర్ తో ఇప్పట్లో సినిమా లేదు. ఆయన ఫ్యాన్స్ సాటిసిఫై చేస్తా అనే నమ్మకం కలిగినప్పుడు మళ్లీ తప్పకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు రాహుల్. తీసే కంటెంట్ సరిగా లేకుండా ఫ్యాన్స్ సాటిసిఫై అవరు అని చెప్పడం ఎంత వరకు కరెక్టో రాహుల్ కే తెలియాలి.













