అక్కినేని బ్రదర్స్ మల్టీస్టారర్?
మల్టీస్టారర్ చిత్రాలు చేయడం అక్కినేని కథానాయకులకు కొత్తేమి కాదు. తాజాగా ఈ ఫ్యామిలో హీరోల నుంచి మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్ కథానాయకులుగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. ఆయన పనితనం ఎంతగానో మెచ్చిన నాగార్జున ఈ మల్టీస్టారర్ బాధ్యతలు ఆయనకే అప్పజెప్పారని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇదిలావుండగా మన్మథుడు-2 అనంతరం నాగార్జున కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత నాగచైతన్య, అఖిల్ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.













