రాహు టీజర్ విడుదల
అభిరామ్ వర్మ, కృతి గార్గ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం రాహు. సుబ్బు దర్శకుడు. ఏవీఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జీ, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ఒక యువతి తనలోని భయాలు, ఒత్తిళ్ల కారణంగా కొన్ని ప్రమాదకరమైన సమస్యల్లో చిక్కుకుంటుంది. ఆ చిక్కుల నుంచి ఆ యువతి ఎలా తప్పించుకోగలిగిందన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అభి, కృతికా కొత్త వారైనా చాలా బాగా నటించారు. అమర్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. సుబ్బు చెప్పిన కథ నచ్చి నిర్మించడానికి ముందుకొచ్చాం అన్నారు నిర్మాత స్వామి.













