త్వరలో ‘రహస్యం’ విడుదల
సాగర్ శైలేశ్, శ్రీరితిక జంటగా నటించిన రహస్యం చిత్రం విడుదలకు సిద్దమైంది. సాగర్ శైలేశ్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిరుచి కలిగిన మంచి నిర్మాత రామసత్యనారాయణగారు. చక్కని పానింగ్తో సినిమా తీసి విడుదల చేయడం ఆయన పద్ధతి. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకొంటున్నాను అన్నారు. మా దర్శకుడు ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాడు. సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలోనే విడుదల చేస్తాం అని తెలిపారు రామసత్యనారాయణ.













