Mysaa: రష్మిక నమ్మకాన్ని ఆ డైరెక్టర్ నిలబెట్టుకుంటాడా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న రష్మిక వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్పుడా క్రేజ్ ను వాడుకుని ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేయాలని చూస్తున్న రష్మిక పలు సినిమాలను లైన్ లో పెట్టి వాటిని చేస్తోంది.
అందులో భాగంగానే రెయిన్ బో(Rainbow), ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend) సినిమాలతో పాటూ రీసెంట్ గా మైసా(Mysaa) అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసింది రష్మిక. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అసలు మనం పోస్టర్ లో చూస్తుంది రష్మికనేనా అన్నట్టు అమ్మడు కనిపించింది. మైసా సినిమాకు రాఘవేంద్ర పుల్లె డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.
రవీంద్ర పుల్లె(Ravindra Pulle) హను రాఘవపూడి(Hanu Raghavapudi) దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా, ఇప్పుడు మైసా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. మొదటి సినిమానే రష్మికతో సెట్ చేసుకుని ఆమె క్రేజ్ ను, టాలెంట్ ను తెలివిగా వాడుకుంటున్న రవీంద్ర ఫస్ట్ లుక్ తోనే మైసాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాడు. అయితే మొదటి సినిమా కావడంతో రష్మిక ను అతనెలా హ్యాండిల్ చేస్తాడనే విషయంలో మాత్రం అందరికీ కాస్త అనుమానాలున్నాయి. చూడాలి మరి రవీంద్ర మీద రష్మిక పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం నిలబెట్టుకుంటాడో.