కేరళకు లారెన్స్ భారీ విరాళం
కేరళ వరద బాధితులకు రాఘవలారెన్స్ కోటీ రూపాయల భారీ విరాళం ప్రకటించారు. అలాగే కేరళ ముఖ్యమంత్రిని ఒక కోరికను కోరనున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. కేరళకు విరాళాన్ని అందించడంతో పాటు వరదల కారణంగా ఎక్కువగా దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకొని స్వయంగా సేవ చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రిని కలిసేందుయు అపాయింట్మెంట్ను పొందానని, ఆరోజున సహాయన్ని అందిస్తానని తెలిపారు. ఏ ప్రాంతమైతే బాగా దెబ్బతిన్నదో ఆ ప్రాంత ప్రజలకు స్వయంగా సేవ చేసేందుకు అవకాశం కల్పించమని కోరనున్నానని లారెన్స్ తెలిపారు. ఇప్పటి వరకూ కేరళకు విరాళాన్ని ప్రకటించిన వారికీ, ప్రకటించబోతున్నవారికీ థాంక్స్. కేరళ త్వరగా పునర్నిర్మితం కావాలని రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తున్నాను అని లారెన్స్ ట్వీట్లో పేర్కొన్నారు. లారెన్స్ స్వయంగా వెళ్లి ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించడంతో పలువురు సోషల్మీడియాలో ఆయనను ప్రశంసలతో ముంచెతుతున్నారు.













